వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు మద్దతుగా విజయవాడలో చేపట్టిన మహాధర్నాలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. జగన్ వెంటనే ఉంటున్న వంగవీటిని జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనిని బట్టి వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.