తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో ఆస్ట్రేలియా తరహాలో దాడులు చేస్తామని వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) హెచ్చరించింది. తెలంగాణాలోని పది జిల్లాల్లో నివశిస్తున్న సీమాంధ్ర ప్రజలపై ఈ దాడులు కొనసాగుతాయని వారు సంచలన ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా నోరు మెదపక పోవడం గమనార్హం.