ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నక్సలైట్లతోనైనా కలిసి పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకోసం అవసరమైతే నక్సలైట్ల పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి వరంగల్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే తెలంగాణ విషయంపై అవకాశవాద కాంగ్రెస్, తెలంగాణ పార్టీలతో ఎప్పటికీ పనిచేయబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.