హైదరాబాద్ యుటీగా వద్దంటే వద్దు : లగడపాటి రాజగోపాల్

SELVI.M|
FILE
హైదరాబాద్‌ను యూటీగా చేయడానికి తాను వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్‌ యుటీగా వద్దంటే వద్దని లగడపాటి అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీల్లో నిర్ణయం నిలకడగా లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.

అందువల్ల కేంద్ర విభజనకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని లగడపాటి కేంద్రాన్ని కోరారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన పార్టీలు కూడా ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయ చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సమైక్యం వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు.

రాష్ట్రాన్ని విభజిస్తే సాగునీరు, విద్యుత్ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్రుల ఉద్యమాలకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్రులు అలా చేయలేదన్నారు.


దీనిపై మరింత చదవండి :