రాష్ట్ర విభజనకు హైదరాబాదే ప్రధాన పీఠముడిగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే ఓ చిక్కుముడి అని అన్నారు.