తెలంగాణ కోసం నక్సలైట్లతోనైనా కలిసి పనిచేస్తాం!: కిషన్

SELVI.M|
FILE
ప్రత్యేక రాష్ట్రం కోసం నక్సలైట్లతోనైనా కలిసి పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకోసం అవసరమైతే నక్సలైట్ల పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి వరంగల్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే తెలంగాణ విషయంపై అవకాశవాద కాంగ్రెస్, తెలంగాణ పార్టీలతో ఎప్పటికీ పనిచేయబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ అంశంపై శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో ఆరో సూత్రాన్ని అమలు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల రాజీనామాలను అధిష్టానం చూసుకుంటుందని శైలజానాథ్ చెప్పారు.

ఆగస్టు 15వ తేది వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు అందిస్తామని చెప్పారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ ఆరో సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శైలజానాథ్ ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఢిల్లీలో మకాం వేయనున్నారు.


దీనిపై మరింత చదవండి :