26లోపు తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు: కాంగ్రెస్ యోచన

SELVI.M|
గణతంత్ర దినోత్సవానికి ముందే తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్షానికి ముందే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో రెండు రోజుల్లో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ప్రత్యేక విషయంలో తమ పార్టీ నేతల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పాయింట్లు సూచించిన నేపథ్యంలో వారు తెలంగాణ ప్రకటించడమో లేదు తెలంగాణకు రాజ్యాంగబద్ద రక్షణ కల్పించటమో ఏదో నిర్ణయం ఈ నెల 26లోపు తీసుకొని అఖిలపక్షాన్ని మరోసారి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేదించాలని చూస్తోంది.


దీనిపై మరింత చదవండి :