ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2026 (16:21 IST)

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

potti sriraamulu statue
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్మగౌరవ ప్రతీకగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ప్రతిష్టించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
 
సోమవారం ఉదయం పది గంటలకు జరిగే అమరావతిలోని శాఖమూరులో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏపీ ప్రభుత్వం 6.8 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించగా, ఇక్కడ స్మృతివనం నిర్మించారు. ఈ స్థలంలో శంకుస్థాపన జరిగిన కేవలం ఆరు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేశారు. ఈ విగ్రహం  తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే "స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్"గా ఉంటుంది మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌‍మెంట్ చైర్మన్ డూండి రాకేశ్ వెల్లడించారు.