1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ACB Registered a case on appannas illegal assets who was-identified-as-accused-in-tirumala-laddoo-case

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

Tirumala Laddu
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కదురు చిన్నప్పన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 
 
వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధీకుల నివాసాల్లోనూ గత రెండు రోజులుగా సోదాలు నిర్వహించారు. 
 
విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడలోని కృష్ణలంక, గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో ఈ సోదాలు చేశారు. ఈ సందర్భంగా అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుషికొండ, పరవాడ, తగరపువలస, తాడేపల్లిలో ఖరీదైన స్థలాలు, నివాసాలు - వాటి విలువ పదుల కోట్లలోనే వైఎస్సార్సీపీ హయాంలోనే కొన్నట్లు నిర్ధారణ అయ్యింది.
 
మండపేట మండలం ఏడిద గ్రామంలోని తన సోదరి ఇంట్లో ఉన్న చిన్నప్పన్నను సోమవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జూన్ 8 వరకూ అతనికి రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. దీంతో అతన్ని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. చిన్నప్పన్న మొదటి నుంచి వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా చేసేవారు. 
 
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతణ్ని దిల్లీలోని ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారి పోస్టులో నియమించారు. వైఎస్సార్సీపీ హయాంలో నాలుగేళ్ల పాటు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉండటంతో అతని పీఏ హోదాలో చిన్నప్పన్నే టీటీడీ వ్యవహారాల్లో చక్రం తిప్పేవారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలోనూ ఇతనిదే ప్రధాన పాత్ర.
 
నెయ్యి సరఫరా కాంట్రాక్టు రావాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచాలు ఇవ్వాలని డెయిరీ ప్రతినిధులను డిమాండ్ చేశారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండీ జగ్‌మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో 50 లక్షల వరకూ లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ కల్తీ నెయ్యి సరఫరా కేసు బాధ్యతలు చూసిన సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)