1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Amit Shah garu, won-t you arrest him, Janasainiks burst into laughter at Deputy CM Pawan-s dialogue; Video gone viral

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Janasainiks burst into laughter at Deputy CM Pawan-s dialogue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మనసులోని మాటలను సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంటారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అయితే చర్చలు జరగడం మామూలే. ప్రస్తుతం వాటన్నిటిలో ఓ చిన్న వీడియోను మాత్రం నెటిజన్లు విపరీతంగా షేర్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారో తెలుసుకుందాము.
 
ఆయన మాటల్లోనే... నేను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారితో ఏం మాట్లాడతాను, ఏమి అడుగుతాను అని నన్ను అడుగుతుంటారు. ఆయనతో నేనేమి మాట్లాడతాను. నేను మాట్లాడేదల్లా... దేశం భవిష్యత్తు గురించి, మన రాష్ట్రాభివృద్ధి గురించి. అంతేతప్ప ఇంకేమైనా మాట్లాడగలమా... వాళ్లను అరెస్ట్ చేయండి సార్. మోదీ గారూ, ఈయన్ని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు వున్నారు. వారిని అరెస్ట్ చేయరా... అమిత్ షా గారూ ఆయన్ని అరెస్ట్ చేయరా...
 
ఎంత హాస్యాస్పదంగా వుంటుందంటే... వీళ్లు ఇంత దిగజారిపోయారేమిటా అనిపిస్తుంది. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరకెళ్లి ఇట్లాంటి మాటలు మాట్లాడుతామా.... అంటూ సెటైర్లు వేసారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
పటిష్ట రికవరీని నమోదు చేసిన ఈక్విటీ మార్కెట్: పీఎల్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ నివేదిక