సంబంధిత వార్తలు
- వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ఇకపై శాశ్వతంగా కొనసాగుతుంది.. ఏపీ సీఎం చంద్రబాబు
- విశాఖను విశ్వనగరంగా చేస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలిశాను: ప్రధానమంత్రి నరేంద్ర మోడి
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ... పవన్ కళ్యాణ్ నివాసానికెళ్లి పరామర్శ
- తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడి రాక, పవన్ ఇంటికి కూడా...
ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గింపుపై కేంద్రం దృష్టిసారించింది. ఈ పొదుపు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పైగా, తన కాన్వాయ్‌లోని వాహనాలను సగానికి సగం తగ్గించారు. ఇదే మార్గంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాటించారు. తమ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని వారు ఆదేశించారు.
జిల్లా పర్యటనల్లో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలన్నారు. ఈ మేరకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో భేటీలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 శాతం వాహనాల తగ్గింపు అన్ని స్థాయుల్లో అమలు చేయాలన్నారు. మంత్రులు, వీఐపీలు కూడా వీలైనంత తక్కువ వాహనాలు వాడేలా చూడాలని ఆదేశించారు. ఇంధన పొదుపు చర్యల్లోభాగంగానే ఈ తరహా చర్యలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
పీఎం కాన్వాయ్‌లో సగానికి తగ్గిన వాహనాలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల కారణంగా దేశంలో చమురు కొరత ఏర్పడివుంది. దీన్ని కొంతమేరకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కాన్వాయ్‌లో ఉపయోగించే వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించారు. ప్రస్తుతం ఆయన రెండు వాహనాల కాన్వాయ్‌తోనే ప్రయాణించారు.
ఇంధన కొరత దృష్ట్యా ఈ మేరకు మార్పులు చేశారు. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధాని మోడీదీ.. స్వయంగా వాటిని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
సాధారణంగా, ప్రధాని కాన్వాయ్‌లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్650 గార్డ్, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లతో సహా కనీసం 12-15 వాహనాలు ఉంటాయి. దేశంలో ఇంధన కొరత కారణంగా తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోడీ ఆదేశించినట్లు ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన వెళ్లే దారుల్లో తప్పనిసరి భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తామన్నారు.
మరోవైపు, ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు తమ కాన్వాయ్ సైజును రెండు వాహనాలకు కుదించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు వెల్లడించారు.
తర్వాతి కథనం
