1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Covid deaths put states on alert; experts say no need for panic

ఆంధ్రాలో మళ్లీ వెలుగు చూసిన కరోనా... ఇప్పటికే నలుగురు మృతి

COVID-19 cases
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వెలుగు చూసింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే నాలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
 
జూన్ 26వ తేదీ నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులను కడప, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ కేసుల్లో నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జూలై 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?