కేసు నుంచి కొడుకును తప్పించబోయి తాను ఇరుకున్న వైకాపా మాజీ మంత్రి
గత వైకాపా ప్రభుత్వంలో అధికార మదంతో రెచ్చిపోయిన పలువురు వైకాపా నేతలు, మాజీ మంత్రులకు దేవుడే తగిన గుణపాఠం చెబుతున్నాడు. ఓ వ్యక్తిని మరణానికి కారణమైన తన కుమారుడిని కేసు నుంచి తప్పించబోయిన వైపాకా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చివరకు తానే ఆ కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ. అతి నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన కొడుకును కాపాడుకునేందుకు వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనేక అడ్డుదారులు తొక్కారు. ఈ విషయాన్ని పోలీసులు బట్టబయలు చేయడంతో ఆయన చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. సాక్ష్యాలు తారుమారుకు ప్రయత్నించినట్టు స్పష్టంగా ఆధారాలు దొరకడంతో ఏ క్షణమైనా సీదిరి అరెస్టు కావచ్చునని తెలుస్తోంది.
ఈ కేసులో కొడుకు ఆరవ్ వర్మను జైలుకు పంపిన పోలీసులు... అప్పలరా జుపై బీఎన్ఎస్‌లోని 61(2), 238, 240, 242,249,49 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేసులో ఆరవ్ వర్మ ఏ1 కాగా, సీదిరి అనుచరుడు సిద్ధార్థ త్యాడి ఏ2, సీదిరి ఏ3లుగా చేర్చారు. ఆరవ్, సిద్దార్థలను ఇప్పటికే పోలీసులు జైలుకు పంపించారు. ఇక ఇప్పుడు అప్పలరాజు వంతు అని పలాసలో చర్చ జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా సీదిరి కదలిక లపై పోలీసులు నిఘా పెట్టారు.
అరెస్టు తప్పకపోతే బెయిల్, ఇతర రక్షణల విషయమై సీదిరి తన న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు సమాచారం. మరోవైపు న్యాయవాదితో కలసి అప్పలరాజు భార్య అంపోలు జిల్లా జైలుకు వెళ్లి ఆరవ్‌ను కలసివచ్చారు. ప్రమాద ఘటన గురించి సీదిరి మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. యాక్సిడెంట్‌కు రెండు రోజుల ముందే ఆరవ్ వర్మకు ఎల్ఎల్ఆర్ జారీ కావడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
