మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (21:12 IST)

మెడికల్ పీజీ కేసులో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు

ఆంధ్రప్రదేశ్ మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 57 పైన ఆధిపత్య కులాల విద్యార్థులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో  ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడు కేసన శంకర్ రావు ఈరోజు ప్రముఖ న్యాయవాది వై కే ఆధ్వర్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు,

గతంలో రిజర్వేషన్ విద్యార్థులకు కష్టతరంగా ఉన్నా జీవో నెంబర్ 43 లోని రిజర్వేషన్ విద్యార్థులకు నష్ట కరమైన క్లాజును సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 29- 5 -2020 న జిఓ నెంబర్ 57 ను జారీచేసింది. కొత్త జీవో ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఒక కాలేజీలో ఒక స్పెషల్ సబ్జెక్ట్లో సీటు తెచ్చు కొని తిరిగి రిజర్వేషన్ కేటగిరీలో కి వచ్చి మరో విభిన్నమైన స్పెషల్ సబ్జెక్ట్లో సీటు తీసుకున్నప్పుడు ఓసి లో కాళీ చేసిన స్థానాన్ని తిరిగి ఓసీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 43 చెబుతుంది.

కానీ సవరించిన జీవో నెంబర్ 57 ప్రకారం ఖాళీ చేసిన స్థానం అదే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వాలని స్పష్టం చేసింది, ఈ సవరణ తమకు నష్టం కలుగుతుందని ఏపీ హైకోర్టులో ఆధిపత్య కులాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గత మే 31 తారీఖు న పిటిషన్ దాఖలు చేశారు,

ఆ పిటిషన్ లో జీవో నెంబర్ 57 లోని సవరణలు బలపరుస్తూ రిజర్వేషన్ వర్గాలకు మెడికల్ పీజీ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకై బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు తమ వాదనను కూడా వినమని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మరియు సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ ద్వారా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

జీవో నెంబర్ 57 వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు న్యాయమూర్తులు శేష సాయి, లలితతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది, ప్రభుత్వం, తదితర ప్రతివాదులకు తమ తమ కౌంటర్లను దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 18వ తారీఖుకు వాయిదా వేశారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున కౌంటర్ దాఖలు చేసి న్యాయవాది వైకే తమ వాదనలు వినిపిస్తారు.