అమరావతి రాజధానిలో 90 మంది రైతులకు 135 ప్లాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఈరోజు ప్లాట్లను కేటాయిస్తోంది. ఈ-లాటరీ విధానంలో ప్లాట్లను ఇవ్వనున్నారు. మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు.
ఉండవల్ల పరిధిలో మెట్ట భూములను ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పటయ్యాక రాజధాని అమరావతి పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని చట్టబద్ధత కూడా త్వరలోనే రానుంది.