1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anna Lezhneva admits she felt alone, scared as Pawan Kalyan entered politics : Wanted to break down

నా భర్త పొలిటికల్ జర్నీ ముళ్లపై నడకలా సాగింది : పవన్ కళ్యాణ్ సతీమణి

pawan - anna
తన భర్త, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై ఆయన సతీమణి అన్నా లెజినోవా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన భర్త రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చేసే ఒంటరి పోరాటం చూసి... ఒక్కడు ఇంకెంత కాలం పోరాటం చేయగలడు..? అనిపించిందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్నా లెజినోవా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్‌స్టా ఖాతాలో ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. 
 
'పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు. కానీ ఈ స్థాయికి చేరుకు నేందుకు ఆయన ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. అంతకుముందు పవన్ ఎన్నో ఓటములు చవిచూశారు. విజయం, ఫొటోలు, చిరునవ్వులు, సంబరాలు, వార్తలు ఇవే అందరికీ కనిపిస్తాయి. 
 
కానీ, వాటి వెనుక ఏళ్ల తరబడి సాగిన పోరాటం, అలసట, అవమానాలు, అనిశ్చితిని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు. ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. చాలామంది ఆయన్ను అవమానించారని, ఎగతాళి చేశారని, ప్రశ్నించారని, రకరకాల పేర్లతో దూషించారు. 
 
పవన్ బయట రాజకీయ పోరాటాలు చేస్తుంటే.. తాను ఇంట్లో పిల్లల కోసం ధైర్యంగా నిలబడేందుకు ప్రయత్నించాను. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది. పవన్ విజయం కేవలం రాజకీయ విజయం కాదని.. మానవతా విజయం. కళ్లలో నీళ్లతో అక్కడ నిలబడటం తనకు ఇంకా గుర్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కన్నీటిని గుర్తించారు' అని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తుని చిన్నారి అదృశ్యం కేసులో పెంపుడు కుక్క మృతి, మరింత అనుమానం, వీడియో