సంబంధిత వార్తలు
- డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం
- Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)
- రోడ్డుపక్కన తాటిముంజలు ఆరగించిన సీఎం చంద్రబాబు దంపతులు
- తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి
- హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కలిశాను: ప్రధానమంత్రి నరేంద్ర మోడి
కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గం చామవరంలో కల్లు గీత కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఓ గీత కార్మికుడి ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకి స్వహస్తాలతో సదరు కార్మికుడు తాటి ఆకులో కల్లు పోసి ఇచ్చాడు. వాటిని రుచి చూసారు సీఎం చంద్రబాబు. తాటిచెట్ల నుంచి తీసే తాటి కల్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ తాటి కల్లు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుంది.
తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి.
మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది.
ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.
ఆటలమ్మ, మీజిల్స్ వంటివి వచ్చినప్పుడు తాటికల్లు తాగితే శరీరం చలువ చేస్తుందని చెబుతారు.
తాడిచెట్ల నుంచి కల్లు తీశాక కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది, దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం.
అందుచేత చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కొంతమంది కల్లులో క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయన్ని కలుపుతారు. ఇది శరీరంపై చెడు ప్రభావం కలుగుతుంది.
