సంబంధిత వార్తలు
- గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్
- కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కల్లు ప్రయోజనాలు తెలుసా?
- డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం
- Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)
- రోడ్డుపక్కన తాటిముంజలు ఆరగించిన సీఎం చంద్రబాబు దంపతులు
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.
'రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. ఏపీ రైతులు ప్రపంచస్థాయి నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తున్నారు. ఉద్యాన పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాం. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్ రంగాల్లో సహకారం కావాలి. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉంది. పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారు.
పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి సాధ్యమవుతుంది. భారత్‌ను నంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధాని చొరవ కారణంగా ప్రపంచస్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయి' అని చంద్రబాబు అన్నారు. సింగపూర్ వర్సిటీలు, ఏపీ విద్యాసంస్థలకు మధ్య భాగస్వామ్యానికి కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
