సంబంధిత వార్తలు
- ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం.. క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ల ప్రారంభం
- వైకాపాలో జగన్ మాత్రమే కాదు.. చాలా మంది సైకోలు ఉన్నారు : చంద్రబాబు
- అమరావతి వర్సెస్ మావిగన్- 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు?
- 'మావిగన్' కాకుంటే 'అయోధ్య' అని పేరు పెట్టుకోండి : పేర్ని నాని
- అమరావతిలో ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందం..
అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
క్వాంటం ఫెసిలిటీ సెంటర్ అమరావతిలో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, గన్నవరంలోని మేధా టవర్స్‌లో క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకింతం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
దీనికి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ వర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్‌గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
ఒక ఇంటికి రూ.10 వేలు, మూడు పండుగలకు మూడు సిలిండర్లు ఫ్రీ... బీజేపీ మేనిఫెస్టో
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలతో పాటు చిన్నాచితక పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా మేనిఫెస్టోను వెల్లడించింది. ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2 వేలు పింఛన్, ప్రతి ఇంటికి రూ.10 వేలు నగదు, సంక్రాంతి, దీపావళి, తమిళ ఉగాది పండుగలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కేంద్ర మంత్రి, ఆ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలోని హామీలను పరిశీలిస్తే...
ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు నెలకు రూ.2,000 ఆర్థికసాయం
ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు (పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం రోజున)
ఆర్థికసాయం కింద ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000
మహిళలకు ఇ-స్కూటర్ల కొనుగోలుపై రూ.25,000 రాయితీ
జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి నెలకు రూ.2,000 సాయం
జల్లికట్టులో పోటీపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్-గ్రేషియా
మహిళలకు రూ.8000 విలువైన కూపన్ (టీవీ వంటి గృహోపకరణాలు కొనుక్కోవడం లేదా మార్చుకోవడానికి)
తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజూ రెండు గంటల దర్శన సమయాల కేటాయింపు వంటి హామీలను ప్రకటించారు.
తర్వాతి కథనం
