1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ap cm chandrababu naidu talk about good health

రూ.కోట్లు ఉన్నా సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభం : సీఎం చంద్రబాబు

chandrababu
కోట్లాది రూపాయల విలువ చేసే నగదు, నగలు, ఆస్తులున్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే ఏం లాభమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ పేరుతో నిర్మించిన ఆస్పత్రిని ఆయన బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా సీఎం బాబు మాట్లాడుతూ, లలిత ఆస్పత్రి, ల్యాండ్ మార్క్ ఇనిస్టిట్యూట్‌గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
అలాగే, ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్లు, పదవులు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. లలిత ఆసుపత్రి 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ప్రారంభమైంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక కేంద్రమిది. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్‌ రికార్డు ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మంచి అలవాట్లతో అనారోగ్యం మన దరి చేరదు. యోగా, ధ్యానం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అని చంద్రబాబు తెలిపారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వరల్డ్ క్లాస్ ట్రాన్సిట్ హబ్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్