సంబంధిత వార్తలు
- ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం
- శ్రీకాళహస్తిలో పంచాయతీలకు ఈవీ చెత్త సేకరణ వాహనాలు, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హెచ్‌సీసీబీ
- రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు
- ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ
- వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి
జనసేన ఊపిరిలూదుకున్నది తెలంగాణ గడ్డపైనే : పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొన్నారు. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నదని చెప్పారు. తెలంగాణ సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
'అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. ఆ లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తానని, దీనికైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నా అని తన పోస్టులో పేర్కొన్నారు.
