సంబంధిత వార్తలు
- AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?
- నేపాల్ సరిహద్దుల్లో మనీ డెన్ కీపర్ ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు
- ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు
- Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్
నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నారు.. నేడు వరుసగా జైలుకు..
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కో స్కామ్ ఇపుడు వెలుగులోకి వస్తోంది. ఫలితంగా నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇపుడు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ముఖ్యంగా, జగన్ పాలనలో జరిగిన మద్యం స్కామ్ ఇపుడు కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు సిట్ దర్యాప్తు, అరెస్టుల పర్వం సాగింది. ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఫలితంగా ఇపుడు లిక్కర్ స్కామ్ సామ్రాజ్యం పునాదులు కదులుతున్నాయి. దీంతో ఈ స్కామ్‌కు సూత్రధారులు, పాత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో నాటి సీఎం జగన్ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, బేవరీజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలను గురువారం ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత వీరికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచగా, కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇపుడు ఈ లిక్కర్ స్కామ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న భయం వైకాపా పెద్దలను కలవరపెడుతున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
