రావణ్ వ్యాఖ్యలే జగన్‌కు ముఖ్యమా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోమారు మండిపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా లేదా ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమా అని మంత్రి ఆనం సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. రావణ్‌కు జగన్ మద్దతిస్తానంటారా? అని నిలదీశారు.
'వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం హిందూమతాన్ని తక్కువ చేసి చూపిస్తారా? పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు. హిందూ సమాజాన్ని కించపరచడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్, రావణ్, గొడ్డలి పార్టీకి ఎవరు అధికారమిచ్చారని ప్రశ్నించారు.
స్వేచ్ఛను ఆధారంగా చేసుకొని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతామంటే ఒప్పుకొనేది లేదు. వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు హిందూమతాన్ని ఏనాడూ కించపరచలేదు. మఠాధిపతులు, పూజారులను గౌరవించే సంస్కృతి మనది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూమతాన్ని విచ్ఛిన్నం చేస్తారా? విద్వేషాలు రెచ్చగొట్టే అధికారం జగన్, రావణ్, గొడ్డలి పార్టీకి ఎవరిచ్చారు?' అని ఆయన నిలదీశారు.
