సంబంధిత వార్తలు
- ప్రేక్షకులను ఆకర్షించేందుకు హద్దులు దాటేస్తున్నారు.. నియంత్రణ ఉండాల్సిందే.. కంగనా రనౌత్
- మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు
- అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలి.. వైకాపా నేతలు
- AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం
- హమ్మయ్య.. ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్
తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ : మంత్రి అచ్చెన్నాయుడు
తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ కోసం వెంపర్లాడిన నేత జగన్మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌కు అధికార దాహం ఎక్కువన్నారు. వైఎస్ఆర్ మరణించిన సమయంలో తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి కర్చీ కోసం జగన్ సంతకాలు సేకరించిన చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరని ఎద్దేవా చేశారు.
జగన్‌కి ఉన్న అధికార పిపాసను చూసే గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అందుకే వైకాపాని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేశారన్నారు. తమ ప్రభుత్వం అమరావతిని రాష్ట్రానికి ఒక అక్షయపాత్రలా తీర్చిదిద్దుతుంటే జగన్, ఆయన అనుచరులు మాత్రం అవినీతికి కామధేనువుగా చిత్రీకరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో తగిలిన దెబ్బ ఇంకా పచ్చిగానే ఉందని, ఇప్పటికైనా అబద్దాలు ప్రచారం చేయడం ఆపకపోతే భవిష్యత్‌లో మరింత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తన దిగజారుడు రాజకీయాలతో ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని, కానీ ఏపీ ప్రజలు ఆయన మాటలు నమ్మే స్థితిలో లేరని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. అమరావతి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
