1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP Police freezed Prashna Ravan banks accounts

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మెడకు బిగిస్తున్న ఉచ్చు - బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

prashna ravan
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ చుట్టూత ఉచ్చు బిగుస్తోంది. ఆయన ఆర్థిక వనరులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. విద్వేషపూరిత కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి ప్రశ్న వెబ్‌సైట్‌ ద్వారా రావణ్‌ నెలకు రూ.1.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలని రెండు వేర్వేరు బ్యాంకుల అధికారులకు కాకినాడ పోలీసుల లేఖ రాశారు. 
 
పోలీసుల విజ్ఞప్తితో బ్యాంకు అధికారులు ఖాతాలు నిలిపివేశారు. ఇప్పటికే రావణ్ మొబైల్‌ను ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. డిలీట్‌ చేసిన డేటా, వాట్సాప్‌ ఛాటింగ్‌లపై ఫోరెన్సిక్‌ నివేదిక పోలీసులకు అందిందింది. డేటా రికవరీ చేశాక అతని అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రావణ్‌ ఒక్కరే చేస్తున్నాడా? వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆ దేవుడు పవన్ కల్యాణ్ వచ్చిండు, నా కొడుకు నిమ్మళమయ్యుండు: నిరంజన్ తండ్రి వీడియో