జగన్‌కు హిందువులంటే లెక్కలేదు.. ఆ మాటలు వింటుంటే.. శ్రీనివాసానంద సరస్వతి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో జరిగిన చోరీపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే గుండె తరుక్కుని పోతోందనని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ,
పరకామణి చోరీని చిన్న కేసు అని మాజీ సీఎం జగన్ వ్యా
ఖ్యానించడం ఆయన లెక్కలేని తనానికి నిదర్శనమన్నారు. పైగా, హిందువులంటే వైకాపా నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారా? అని నిలదీశారు.
'వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా జగన్ మాట్లాడతారా? ఆయన వ్యాఖ్యలు వింటుంటే గుండె పగిలిపోతోంది. వేంకటేశ్వరస్వామి గురించి మాట్లాడేటప్పుడు ఎంతో భక్తిభావంతో ఉండాలి. హైకోర్టు మొట్టికాయలు వేసినా జగన్‌కు బుద్ధిరాలేదు. హిందూ మతం, దేవాలయాలపై దాడి చేయడమే వైకాపా పనిగా పెట్టుకుంది. ఆ పార్టీ నేతలు హిందువుల పక్షాన ఎప్పుడు నిలబడ్డారో చెప్పాలి' అని శ్రీనివాసానంద సరస్వతి నిలదీశారు.