సంబంధిత వార్తలు
- అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం.. ఏపీ సంబురాల్లో సీఎం దంపతులు (video)
- అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. ఏడు గంటలకు దీపాలు వెలిగించండి.. నారా లోకేష్
- అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభ ఆమోదం.. ఏపీలో పండగ
- రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ రేణుకా చౌదరి నినాదాలు
- అమరావతి బిల్లు.. చంద్రబాబు ప్లేస్లో నారా లోకేష్.. ప్రధానితో భేటీ.. బాబు ట్రైనింగ్ ఇస్తున్నారా? (video)
AP Thanks India, ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత ఇదే తొలిసారి, చంద్రబాబు పూజలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదించింది. బుధవారం ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందగా ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో ఏపీ రాజధానిగా అమరావతి చిరస్థాయిగా నిలవనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక్క వైసిపి తప్ప దేశంలోని అన్ని పార్టీలు తమ మద్దతు తెలిపాయి. అందుకే ప్రస్తుతం AP Thanks India అనే హ్యాష్ ట్యాగ్ X లో ట్రెండ్ అవుతోంది.
ఉద్దండరాయునిపాలెంలో దీపహారతి వెలిగించి సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు గారు, కూటమి నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతికి మద్దతుగా ప్రజలు దీపాలు వెలిగిస్తున్నారు. #HistoricAmaravatiResolution#APThanksIndia… pic.twitter.com/ez1mGIKceN
— Telugu Desam Party (@JaiTDP) April 2, 2026
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఒక రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం దేశంలో ఇదే తొలిసారి కావడం. ఇది కూడా గత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మూడుముక్కల ఆట సాగించడంతో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పావులు కదిపింది. ఇకపై రాజధానిపై ఎవరూ ఏమీ పిల్లిమొగ్గలు వేయకుండా చట్టబద్ధత ద్వారా తోక కత్తిరించేసింది. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని అసెంబ్లీలో తీసుకుని దాన్ని కేంద్రానికి పంపింది.
1953లో కూడా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత పొందటం ద్వారా తొలి రాష్ట్రంగా చరిత్ర పుటలలో నిలిచిపోనుంది ఆంధ్రప్రదేశ్.
