సంబంధిత వార్తలు
- కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్
- Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్గా చేస్తున్నాడా?
- Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-
- Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు
- ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు
SIRతో జాగ్రత్త, స్టాలిన్, మమతా బెనర్జీ అందుకే ఓడిపోయారు, మనం మరో రకంగా ఓడాము: జగన్
SIRతో జాగ్రత్తగా వుండాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులనుద్దేశించి చెప్పారు. ఇటీవలే ఎన్నికలు జరిగిన తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు రెండూ ఓడిపోయాయని తెలియజెపుతూ, దీనికి SIR ఒక కారణం అంటూ చెప్పుకొచ్చారు. అది ఎలాగో వివరిస్తూ... పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లను తొలగిస్తే, మమతా బెనర్జీ గారి పార్టీ టీఎంసీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. అలాగే తమిళనాడులో 74 లక్షల ఓట్లను తొలగిస్తే.. DMK ఓడింది 17 లక్షల తేడాతో.
మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే.. 15 వేల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూర్ నియోజకవర్గంలో 71 వేల ఓట్లు తొలగిస్తే 8 వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. కనుక నేను చెప్పేదేమిటంటే... SIR పట్ల అప్రమత్తంగా ఉండాలి అని. ఐతే విచిత్రమైన విషయం ఏమిటంటే... తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఓట్లు తీసివేసిందుకు వారు ఓడిపోతే... ఇక్కడ ఓటర్లు పెరగడం ద్వారా మనం ఓడిపోయామంటూ వెల్లడించారు.
