సంబంధిత వార్తలు
- Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
- నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్
- కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్డేట్
- ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు... బాబు - పవన్ అభినందనలు
- Ram Charan: పెద్ది అప్ డేట్: రామ్ చరణ్ బర్త్ డే నాడు పెద్ది క్యారెక్టర్ పోస్టర్, బుకింగ్స్ ఓపెన్
పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలంటూ ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసి, పవన్‌కు ఊరటనిచ్చింది. పైగా ఈ పిటిషన్ విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషనులో కోరారు.
ఈ పిటిషనుపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాల్లో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప, దీనితో డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని వాదించారు.
ఏజీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, పిటిషన్‌కు విచారణ్ అర్హత లేదని చెబుతూ దానిని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.
