Bolisetti Satyanarayana, జనసేనకు గుడ్ బై, Just a small break
జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పర్యావరణ న్యాయం కోసం తన పర్యావర ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నాను ఎందుకు? అని ప్రశ్న వేసి పూర్తి సమాధానం కూడా ఆయనే ఇచ్చారు. ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖలో ఇలా వుంది.
నేను ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో నేను పిటిషనర్‌గా ఉన్నాను. ఈ నేపథ్యంలో నేను నైతిక విరామం తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా మరియు అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న తన పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరం.
ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం, అలాగే పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పరస్పర ప్రయోజనాల సంఘర్షణను (Conflict of Interest) నివారణ కోసం, స్వచ్ఛమైన నీరు మరియు గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
ఇకపై పర్యావరణ పరిరక్షణపైనే నా దృష్టి జల్ బిరాదరీ నేషనల్ కన్వీనర్‌గా తన బాధ్యతలకు మరియు మన ముండి - మన నది కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. పార్టీ పదవి నుండి తత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదు. జనసేన సిద్ధాంతాలకు ఆయన కట్టుబడి ఉంటారు. న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది.
జనసేన సిద్ధాంతాల పట్ల నా నిబద్ధత అచంచలం... అయితే, పర్యావరణ న్యాయం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుత అధికార యంత్రాంగం నుండి స్పష్టమైన దూరం పాటించడం నా నైతిక మరియు ధర్మబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు.