1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. brother dies while dancing at sisters wedding ceremony in chapirevula nandyal watch video

చెల్లి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన అన్నయ్య

brother heartattack
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం జరిగింది. చెల్లి పెళ్ళిలో నృత్యం చేస్తూ అందరినీ సంతోష పెట్టిన అన్నయ్య అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన నంద్యాల మండలం చాపిరేవుల అనే గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో  ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చాపిరేవుల గ్రామంలో జరుగుతున్న తన చెల్లి పెళ్లిలో పవన్ కళ్యాణ్ నటించిన అన్నయ్య చిత్రంలోని "అన్నయ్యా అన్నావంటే..." అనే పాటకు డ్యాన్స్ చేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి సంబరాలతో కళకళలాడాల్సిన ఇల్లు ఒక్కసారిగా నిశ్బందంలో మునిగిపోయింది. అప్పటివరకు ఆటపాటలతో మార్మోగిన ఆ వేదికపై కన్నీటి వర్షం కురిసింది. చెల్లి పెళ్లి అన్న తన చేతులతో ఆశీర్వదించాల్సిన వేళ అతని మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరి జీవితం ఎంత అనిశ్చితమో మరోసారి గుర్తు చేసింద. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎంతో ఆనందంగా ప్రారంభమైన పెళ్లి వేడుక కాస్త కన్నీటి ధారతో ముగిసింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పెళ్లి ఊరేగింపులో వరుడిపై కాల్పులు జరిపిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?