రూ. 399 కూపన్ కొంటే బీఎండబ్ల్యు కారు, తిరుమల ఆలయం ముందే లక్కీ డ్రా అంటూ టోకరా
వాళ్లు మామూలు మోసగాళ్లు కాదు. ఏకంగా మోసం దుకాణాన్ని కలియుగ దైవం తిరుమల వెంకన్న ముందే పెట్టేసారు. లక్కీ డ్రా అంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
పూర్తి వివరాలు చూస్తే... ప్రవీణ్, మహేందర్ అనే ఇద్దరు యువకులు లక్కీ డ్రా అంటూ ఓ పుస్తకాన్ని ప్రింట్ చేశారు. కాకుండా కేవలం 399 రూపాయలు కూపన్ కొంటే లక్కీ డ్రాలో ఫార్చూన్ కార్లు, బీఎండబ్ల్యు కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చని నమ్మించారు. ప్రమోషన్ కోసం ఏకంగా తిరుమల తిరుపతి ఆలయాన్నే ఎంచుకుని అక్కడి నుంచి ఎనౌన్స్ చేసారు.
ఈ వ్యవహారాన్ని గమనించిన సినీ నటి, బీజేపి నాయకురాలు కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో ఆ ఇద్దరు యువకులపై పోలీసులు 318-4 సెక్షన్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.