సంబంధిత వార్తలు
- నెల్లూరులో నో, ఆన్లైన్లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు
- Mahanadu: నెల్లూరులో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు పనులు
- Nellore: నెల్లూరుకు మారిన టీడీపీ మహానాడు? ఎందుకు?
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ : సీఎం చంద్రబాబు
- వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్
మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు.. కార్యకర్తలే బలం, బలగం.. చంద్రబాబు
Chandrababu Naidu
ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలను యుద్ధంగా అభివర్ణించారు. సమావేశం మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు" అని ఆయన స్పష్టం చేశారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిది విధ్వంసకర పాలన అయితే, తమది అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలివేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలిపోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ టీడీపీకి ఉందని, పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని చంద్రబాబు కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, నేతలు ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
తర్వాతి కథనం
