గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (16:14 IST)

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అవకాశాలు అందుకోండి : చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు యేపీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో వివిధ సంస్థలతో రూ.7,840 విలువైన 27 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు అందమైన బీచ్‌ల ఏర్పాటు ప్రతిపాదనలతో పర్యాటక సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖ అందమైన బీచ్‌లు, కొండలతో కూడిన నగరమని, విజయవాడ కాలువల నగరమని, తిరుపతి సరస్సులు, ఆలయాల నగరమని గుర్తు చేశారు. ఆయా నగరాలకు తగిన ప్రతిపాదనలతో సంస్థలు ముందుకు రావాలన్నారు. 
 
ఇకపోతే ఈ భాగస్వామ్య సదస్సులో ఇప్పటివరకు 334 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తంగా రూ.4,80,878 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. వీటిద్వారా 10,15,836 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. పర్యాటక రంగంలో 27 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈఎస్‌ఎస్‌ అండ్‌ ఎల్‌ సంస్థ రూ.83వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.