శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (18:13 IST)

ప్రత్యేక హోదా, ప్యాకేజీపై జైట్లీతో బాబు చర్చలు: ఢిల్లీలో బాబు బిజీ బిజీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అలాగే రెవెన్యూ లోటుకు సంబంధించి చర్చలు జరిపినట్లుగా తెలిసింది. లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని అరుణ్‌జైట్లీకి చంద్రబాబు విన్నవించారు.
 
రాజమండ్రి పాత రైల్వే బ్రిడ్జీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, విజయవాడ, అమరావతి, గుంటూరు రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని బాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ-చెన్నై మధ్య మూడో లైను ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కానినాడ- పిఠాపురం, నడిగుడి - శ్రీకాకుళం రైల్వే లైన్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రతిపాదన చేశారు. పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే లైన్లను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు.