పల్నాడు జిల్లా వినుకొండలో భూకంపం, నిద్ర మంచాల పైనుంచి లేచి జనం పరుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తెల్లవారు జామును భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదనైనట్లు అధికారులు తెలిపారు. కాగా తెల్లవారు జామును భూకంపం రావడంతో నిద్ర మంచాల పైనుంచి లేచి జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీసారు. ఈ భూకంపం భూమికి 20 కిలోమీటర్ల లోతున చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేసారు.
రాబోయే రోజుల్లో కూడా భూకంపాలు రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐతే భూకంపాల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో భారీగా వుండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవలే తెలంగాణలోని భద్రాచలంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.