సంబంధిత వార్తలు
- నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)
- పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ
- దక్షిణ తీర కొత్త రైల్వే జోన్... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్
- పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి
- పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్
ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి పన్నెండు సంవత్సరాల తరువాత కూడా ఇక్కడ సమస్యలు ఉంటే దానికి ఆంధ్రోళ్లు కారణం పవన్ కళ్యాణ్ కారణం అంటూ ఇంకా ఎందుకు ఈ విద్వేషం?. ఎవరిని రానివ్వం, రాకూడదు అంటారా? ఇది భారత్ దేశమా లేక పాలస్తీనా అనుకుంటున్నారా?. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో మాట్లాడేందుకు కూడా అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సమంజసం?
ప్రజలు వేరు పాలకులు వేరు, నేను కేవలం పాలకుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా, నేను కూడా పాలకుల్లో ఒకడిని, నేను తప్పు చేసినా ఉరి తీసేయండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. అప్రజాస్వామికంగా పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పు అని చెప్పాం తప్పా, తెలంగాణకి వ్యతిరేకం అని కాదు.
బాంచన్ సార్ కాళ్లు మొక్కుతాం అనే ఉద్దేశమే ఉంటే… పార్టీ ఎందుకు పెడతామయ్యా? దాడి చేయాలంటే ఇదే నా అడ్రస్. నేను పార్టీ పెట్టిందే నేను చచ్చిపోవటానికి సిద్ధపడి. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన కాంగ్రెస్ నాయకుడు ఈరోజు జనసేనను తిడతారు. పెహల్గాంలో ఉగ్రవాదులు ప్రజల్ని చంపితే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలే. విభజన స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది. తిరిగి గడీల పాలన తీసుకొస్తారా...?
గద్దర్ అన్న బతికున్నప్పుడు మీరెవరైనా ఆయనని పట్టించుకున్నారా? వెన్నులో బుల్లెట్లు దిగి అరే తమ్మీ నేను నడవలేకపోతున్నారా అని నా దగ్గరకి వచ్చి అడిగితే రెండు రోజుల్లో అన్నకి బండి కొనిచ్చా, ఇది చెప్పుకోవాలని కాదు.. మీరు మాట్లాడుతున్నా మాటల వల్ల చెప్తున్నా, అది గద్దరన్నతో ఉన్న బంధం నాది. నేనేదో చెరువును కబ్జా చేసానని అంటున్నారు. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా.. నేను చెరువు కబ్జా చేసాను అని మీరు నిరూపిస్తే అది తెలంగాణ ప్రభుత్వానికే రాసిచ్చేస్తా. కానీ నోటికి ఏదిబడితే అది మాట్లాడే కొంతమంది ప్రాంతీయ విద్వేషం చిందించేవారి పట్ల అంతా జాగ్రత్తగా వుండాలని చెబుతున్నా.
నేను ఏ రోజు కూడా కేసీఆర్‌ని ఒక్క మాట అనలేదు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే నాకెంతో గౌరవం. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. జైలుకి వెళ్లారు. ఐతే ఒక రాష్ట్రానికి చెందినవారు ఇంకో రాష్ట్రంలో వుండకూడదు అంటే అది వేర్పాటువాదాన్ని పెంచిపోషించడమే. అలాంటివాటిని జనసేన ఉపేక్షించదు. అందుకే 2029లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. ఇతర పార్టీల గురించి నాకు తెలియదు. జీహెచ్ఎంసీలో మా వారు పోటీకి రెడీగా వున్నారంటూ చెప్పారు.
తర్వాతి కథనం
