సంబంధిత వార్తలు
- తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న
- ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్
- నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)
- పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ
- దక్షిణ తీర కొత్త రైల్వే జోన్... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్
గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్
తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశానికి పోలీసులు నిరాకరణ, తదుపరి ఇంటివద్దే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా తెలంగాణలో గద్దరన్నతో తనకు వున్న సంబంధం గురించి పవన్ కల్యాణ్ వివరించారు. తనను ఒరేయ్ తమ్మీ అని గద్దరన్న పిలిచేవారనీ, ఆయనతో తనకు ఎంతో అనుబంధం వుందని గుర్తు చేసారు. ఆయన బ్రతికి వుండగా తెలంగాణ నాయకులు ఎవరైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
ఇదిలావుంటే సోషల్ మీడియాలో గద్దరన్న ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి చెప్పిన మాటల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. అందులో గద్దరన్న మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ తెలుసు కదా. నా తమ్ముడు లాంటివాడు. అతడి చొక్కా జేబులో చేయి పెట్టి నేను డబ్బులు గుంజుకుంటా. అంత స్వతంత్రం వుంది.
నేను ఒకసారి నెల్లూరులో ప్రోగ్రామ్ ఇస్తున్నా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి తండ్రి పవన్ ను పిలిచి... ఒరేయ్, అటుఇటూ తిరుగుతావ్ ఎందుకు, గద్దరన్న పాటలు విని బాగుపడు అన్నారంట అని చెప్పారు.
Gaddar on his cordial relationship with Pawan Kalyan pic.twitter.com/QAbXDiJFrm
— Chandra (@Chandra4Bharat) June 2, 2026
