1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. godavari water touches north andhra as cm chandrababu naidu performs jalaharati at payakaraopeta

ఉత్తరాంధ్రలో గోదావరి జలాల పరవళ్లు.. సీఎం చంద్రబాబు జలహారతి

jalahaarati
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేరవేసింది. ఆ జలాలు సెప్టెంబరు రెండో తేదీ బుధవారం చేరుకోగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం ఈ జలహారతి కార్యక్రమం జరిగింది. 
 
రెగ్యులేటర్‌ ఆన్‌ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత సీఎం చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదారమ్మకు సీఎం జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం.రమేశ్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
కాగా, పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్లు నదుల ప్రహానికి ఎగువున అక్విడెక్టులు నిర్మించారు. ఏలేరు నది గర్భం నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలుపను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేయడం ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి. 
 
ఈ ప్రాజెక్టు తొలి దలో అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2.87 లక్షో ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సీఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారని ఎలా చెబుతారు : మంత్రి కొండా సురేఖ ప్రశ్న