గుంటూరు వరుడు కొత్తపెళ్లికూతురికి కొత్తలోకం చూపించాడు, వీడియో
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. అలాంటి పెళ్లి వేడుకను కొంతమంది వధూవరులు చిరస్మరణీయంగా నిర్వహించుకుంటుంటారు. ఇలాగే గుంటూరులోని లాలుపురం గ్రామానికి చెందిన ఓ వరుడు పెళ్లాడిన తన భార్యను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాడు. ఇంతకీ అతడు ఏం చేసాడో తెలుసుకుందాము.
గుంటూరులోని లాలుపురంలోని గ్రామంలో జరిగిన వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు సాయికుమార్ తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. పెళ్లి తంతు ముగియగానే అక్కడికి కొద్దిదూరంలో ఓ హెలికాప్టర్ వచ్చి ఆగింది. గ్రామ ప్రజలంతా హెలికాప్టర్ ఎందుకు వచ్చిందా అని చూస్తుండగా... సాయి కుమార్ తన భార్యను తీసుకుని హెలికాప్టర్ వద్దకు వెళ్లాడు.
ఆమె చేయి పట్టుకుని అందులోకి ఎక్కించాడు. కుటుంబ సభ్యులను కూడా అందులో ఎక్కించాడు. ఇదంతా వారు నమ్మలేకపోయారు. అలా వాళ్లని హెలికాప్టర్లో ఎక్కించుకుని లాలుపురం గ్రామం ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. ఇదంతా గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. కాగా ఈ హెలికాప్టర్ ప్రయాణం కోసం సాయికుమార్ సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.
గుంటూరు : లాలుపురం గ్రామంలో ఘనంగా జరిగిన వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాప్టర్
— RTV (@RTVnewsnetwork) August 16, 2026
తన వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో హెలికాప్టర్ బుక్ చేసుకున్న వరుడు సాయి కుమార్
పెళ్లి తంతు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో ఆకాశంలో చక్కర్లు కొట్టిన నూతన… pic.twitter.com/0kIRXDdYjD
