సంబంధిత వార్తలు
- ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం
- Nag Ashwin: మహానటి తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నాగ్ అశ్విన్
- Smriti Mandhana, పాకిస్తాన్ బౌలర్లను చితక్కొట్టిన స్మృతి మంధన, భారీ విజయం
- అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం : నేడే సంతకాలు
- ఇథనాల్ భవిష్యత్ ఇంధనం అని చెప్పినపుడు అందరూ ఫక్కున నవ్వారు : నితిన్ గడ్కరీ (వీడియో)
విడాకుల కోసం వస్తే వివాహితను అలా వాడుకున్నాడు.. చివరికి?
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె కాపురాన్ని కూల్చి, శారీరకంగా లొంగదీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ అరాచకానికి ఒడిగట్టిన హనుమకొండ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న రోజుల్లో ఒక యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కొన్నాళ్ల తర్వాత దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో..సదరు మహిళ 2022 మార్చిలో తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ బాధితురాలికి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన లాయర్‌తో మాట్లాడించి, ఆమె భర్త నుండి చట్టబద్ధంగా విడాకులు ఇప్పించాడు. భర్త నుండి విడిపోయిన తర్వాత ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని ఎస్ఐ రాజ్‌కుమార్ నమ్మించాడు.
ఆ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. రోజులు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన ఎత్తకపోవడంతో బాధితురాలు నిలదీసింది.
గతంలో రహస్యంగా రికార్డ్ చేసిన ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఎస్ఐ చేస్తున్న ఈ దారుణాలను భరించలేకపోయిన బాధితురాలు.. రెండు రోజుల క్రితం నేరుగా హైదరాబాద్‌లో ఐజీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
