శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (11:29 IST)

హైదరాబాద్‌లో కుంభవృష్టి.. 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు.. రుతుపవనాల కారణంగా తెలంగాణతో పాటు కోస్తా, రాయల సీమలతో ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన ప్రకటించ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు.. రుతుపవనాల కారణంగా తెలంగాణతో పాటు కోస్తా, రాయల సీమలతో ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణకు అతి భారీ వర్ష సూచన ప్రకటించారు. గత 15 ఏళ్లలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు రాబోయే మూడు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మంగళవారం నుంచి వర్షాలు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
 
ముఖ్యంగా హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోటి, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపుల్, గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, బేగంపేట, బోయిన్‌పల్లి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతపూర్, మన్సూరాబాద్, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, రాజేంద్రనగర్... ఇలా హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో అత్యతధికంగా 14 సెంటీమీటర్ల వర్షం పడింది. జంగమేశ్వరంలో 12, దాచేపల్లి, కారంపూడిలలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లా జలదుర్గంలో 11 సెంటీమీటర్లు, చిత్తూరు జిల్లా కాగితిలో 9 సెంటీమీటర్లు, కృష్ణాజిల్లా ఉయ్యూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 10 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 12 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా తాండూరులో 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.