సంబంధిత వార్తలు
- హైదరాబాద్ ఐఐటీహెచ్ స్టూడెంట్ అదుర్స్.. ప్లేస్మెంట్లో రూ.2.5కోట్ల జాబ్ ఆఫర్ (video)
- టమోటాలను రోడ్డున పారేస్తున్న రైతులు.. నిరసన- ట్రాఫిక్ జామ్
- చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక
- గుంటూరులో సమాజాభివృద్ధిని బలోపేతం చేస్తున్న శ్రీ సిమెంట్
- టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?
ఓయ్ ఫ్రెండ్సూ... జాబ్ వేకన్సీరా బాబూ, నెలకి రూ. 12 వేలు, మదనపల్లి మహిళా రైతు ఆఫర్, వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లికి చెందిన ఓ మహిళా రైతు సోషల్ మీడియాలో జాబ్ ఆఫర్ కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె వీడియోలో మాట్లాడుతూ... ఓయ్ ఫ్రెండ్సూ... జాబ్ వేకన్సీరా బాబూ, నెలకి రూ. 12 వేలు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పని వుంటుంది. ఉదయం 6 గంటలకు రాగానే వేడివేడి కాఫీ ఇస్తాము.
మధ్యాహ్నం 12 గంటలకు ఓ కూల్ డ్రింక్. మీరు చేయాల్సిందల్లా టమోటా మొక్కలు నాటడం, పురి కట్టడం, కాయలు కోయడంపై మొదట నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ లేకపోతే చెట్ల కొమ్మలు విరగ్గొడతారని, పచ్చికాయలు కోసేస్తారని. మీకు కేవలం 12 వేల జీతం మాత్రమే కాదు, తోటలోని కూరగాయలు, మామిడికాయలు, ఆకుకూరలు ఉచితంగా ఇస్తాము. ఇలాంటి అద్భుతమైన ఉద్యోగ అవకాశం మళ్లీ రాదు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అంటూ ఆ మహిళా రైతు వీడియో పెట్టింది.
టమాటో తోటలో పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరిన మహిళా రైతు..
— RTV (@RTVnewsnetwork) July 8, 2026
ఈ పనికి నెలకు 12,000 రూపాయల శాలరీ ఇస్తామని..
పని వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయని వెల్లడి..
ఉద్యోగులకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే వేడి వేడి టీ..
మధ్యాహ్నం 12 గంటలకు చల్లని కూల్… pic.twitter.com/FTJzRakF9c
