1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. horrific road accident in usa ap student atluri prasanna dies

అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెలుగు విద్యార్థిని మృతి

atluri prasanna
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని అట్లూరి ప్రసన్నగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా వాసిగా గుర్తించారు. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్న ప్రసన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖసాగరంలోకి నెట్టింది. 
 
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారి వాహనం ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రసన్నతో పాటు మరో యువతి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ప్రసన్న ఇటీవలే న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విధి వక్రించి ప్రమాదం రూపంలో ఆమెను కబళించింది. ప్రసన్న మరణవార్త తెలియడంతో ఆమె స్వగ్రామం మూలపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నిక చెల్లదు : కోర్టుకెక్కిన డీఎంకే నేత