పవన్ కల్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది: బాధిత మహిళ వీణ
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ వీణ మరో వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ... నేను ఎక్కడో దాక్కున్నానని కొంతమంది రాస్తున్నారు. నేను ఎక్కడా దాక్కోలేదు. నేను న్యాయపోరాటం చేస్తున్నాను. నాకు న్యాయం జరిగే వరకూ చేస్తూనే వుంటాను. జనసేన విచారణ కమిటీ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు.
ఐతే మీడియాలో వార్తల ప్రకారం, కమిటీ నన్ను పిలిచిందనీ, నేను రాలేదని ప్రచారం జరుగుతోంది. నన్ను ఏ కమిటీ ఇంతవరకూ సంప్రదించలేదు. పిలిచినా నేను వెళ్లలేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఆపండి. నేను హరిప్రసాద్ గారికి ఓ లేఖతో పాటు పెన్ డ్రైవ్ పంపాను. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను. ఆయన నాకు తప్పక న్యాయం చేస్తారన్న నమ్మకం వుంది.
అందుకే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈలోపు ఏవేవో ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకంటే దిగజారేది ఏమీ లేదు. ఒక ఆడపిల్ల ఇలా బహిరంగంగా బైటకొచ్చి తనకు జరిగిన అన్యాయం చెబుతుందంటే అర్థం చేసుకోండి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.