సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 2 మార్చి 2026 (14:10 IST)

నా పనులన్నీ వదులుకుని వచ్చి తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు: తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu
ఇటీవల సోషల్ మీడియాలో తితిదే చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ... నా పనులన్నీ వదులుకుని వచ్చి తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. ఇదేమీ నా బ్రతుకుదెరువు కాదు. హైదరాబాదులో నా వ్యాపారాలు నాకు వున్నాయి. కొందరు నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు నకిలీ డీప్ ఫేక్ వీడియోను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన రూపాన్ని అనుకరిస్తూ వీడియోలు తయారు చేసి, నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలుచేసేందుకు కుట్ర పన్నుతున్నారు. 
 
వాళ్ల (మహిళ) ఫ్యామిలీతో మాకు 30 యేళ్ళుగా పరిచయాలు ఉన్నాయి. మా ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంటికి మా ఫ్యామిలీ వస్తూపోతుంటాం. ఆ వీడియోలో అశ్లీలత ఏముంది? కొన్ని చోట్ల మార్ఫింగ్ చేసి, ఏదో చూపించాలని చేశారు. సన్నాసులకు సరిగ్గా ఎడిటింగ్ చేయడం కూడా రాలేదు. 
 
వీడియోలో కాకుండా, చూపించిన ఆ ఫోటోలు ఎపుడో 20 యేళ్ళ నాటివి. అందులో అశ్లీలం ఎక్కడ ఉంది?. అన్నీ మిక్స్ చేసి, ఫేక్ చేశారు. మీ బెదిరింపులకు నేను భయపడను. నేను ఏమి తప్పుడు పనులు చేశాను? ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలవరా?, ఆ ఫోటోలు, వీడియోలు తెచ్చి మిక్స్ చేస్తారా? మీ ఇళ్లకు ఫ్రెండ్స్ రారా? మీరు వెళ్లరా?, ఇందులో వల్గారిటీ ఏముంది? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపిచారు.