సంబంధిత వార్తలు
- నన్ను క్షమించకపోతే ఈ ఏడాది అంతా అష్టదరిద్రాలతో సర్వనాశనం అవుతారు: యూ ట్యూబర్ అన్వేష్
- నీతో మాట్లాడాలి అంటూ యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన యువకుడు, మృతి
- దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్
- పోలీస్ నియామక పత్రం అందుకున్న శిరీష మాటలకు డిప్యూటీ సీఎం పవన్ భావోద్వేగం (video)
- ఏయ్ పండూ, మెడలో తాళి కట్టకు, వీడియో తీస్తున్నారు: యువకుడితో యువతి (video)
బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్
ఇదివరకు మీరు చెప్పింది బాగా అనిపించేది ఇప్పుడెందుకో నెగటివ్ అనిపిస్తుంది, అందుకే నేను మీ ఛానల్ అన్ సబ్ స్క్రైబ్ చేసా అని ఓ యువతి వీడియో ద్వారా యూ ట్యూబర్ అన్వేష్ తో అన్నది. ఆ మాటలు విన్న అన్వేష్... నాకు ఇన్‌స్టాగ్రాంలో 18 లక్షల మంది ఫాలోవర్స్ వున్నారు. వాళ్లంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని తెలుసుకున్నా. నాకిప్పుడు మరో 20 వేల మంది పెరిగారు. నేనేమన్నా ఫాలో అవ్వమని చెప్పానా. వాళ్లని నా యూ ట్యూబ్ సబ్‌స్క్రైబ్ చేయమని చెప్పానా. నాకేంటి? నాకు నచ్చిందే నేను చెప్తా. నీకు నచ్చితే చూడు లేపోతే ఫో.
నేను జ్ఞానిని. నేను మోనార్కుని. 128 దేశాలు తిరిగిన జ్ఞానిని. బ్రహ్మదేవుడికి ఎంత తెలుసో నాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. నాకు నచ్చిందే చెపుతా. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు. నేను చెప్పింది విను... వినిసావు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసాడు. చూడండి ఆ వీడియోను...
నేను అన్వేష్ నీ Unsubscribe చేయటానికి reason ఈ వీడియో నే, మీరు కూడా చూసి తరించండి... pic.twitter.com/6bQBNQwl6v
— Lite Food (@UrunDaily) December 31, 2025
ఇండియాకు ఎప్పుడు వస్తే అప్పుడు లోపలేస్తారు
విదేశాల్లో కూర్చుని భారతీయులను కించపరిచే అన్వేష్ అనే యూట్యూబర్‌ను అరెస్ట్ చేయాలంటూ నటి కరాటే కల్యాణి అన్నారు. ఆమె ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ... ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లలో అతడు మాట్లాడిన మాటలు, వాటిపై కంప్లైంట్ ఇచ్చాను. విదేశాల్లో కూర్చుని భారతీయులను అవమానించే ఓ వెధవ. గోమాతను, కుక్కల్ని భారతదేశంలో అత్యాచారం చేస్తున్నారంటున్నాడు. 2.5 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఇచ్చే డబ్బు మదంతో మాట్లాడుతున్నాడు. అతడి మాటలను చూసినవారు అన్ సబ్ స్క్రైబ్ చేయండి. తెలుగువాళ్లు అందరూ కలిసి అంత డబ్బులు ఇస్తుంటే డబ్బులు వస్తున్నాయన్న అహంకారంతో మాట్లాడుతున్నాడు.
14 ఏళ్ల అమ్మాయిని డబ్బులు ఇచ్చి అనుభవించానని చెబుతుంటే ఊరుకుందామా, అతడు మాట్లాడే మాటలు వింటుంటే వళ్లంతా కంపరం కలుగుతోంది. సీతాదేవి, ద్రౌపదిలపైన అవాకులు చెవాకులు మాట్లాడుతాడా? నువ్వు భారతీయుల అందరికి సంస్కృతి, సాంప్రదయాలు నేర్పుతావా? నీ మాతృభూమి గురించి నీవిలా మాట్లాడతావా? ఇండియాకు రావా? పోలీసు శాఖ నీ మీద బాగా నిఘా వేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
హిందూ దేవుళ్లు, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యూ ట్యూబర్ అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలంటూ సినీనటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
