ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (20:42 IST)

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Accused Ravi Kumar
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి కేసులో నిందితుడైన రవికుమార్ తన వ్యధను వీడియో ద్వారా తెలియజేసాడు. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ... నేను ఏప్రిల్ 29, 2023 నాడు పరకామణిలో తప్పు చేసాను. ఆ మహా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో 90 శాతాన్ని తిరుమల వేంకటేశ్వర స్వామికి ఇచ్చేయాలని భావించి, అలాగే చేసాను.
 
నా కుటుంబం నేను ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇందులో ఎవరి ఒత్తిడి నాపై లేదు. ఈ వ్యవహారం పైన ఎన్నో కట్టుకథలు అల్లుతున్నారు. నాపై ఎవరో ఒత్తిడి తెచ్చి ఆస్తులు రాసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. నన్ను కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తున్నారు. వారిపైన కేసులు పెట్టాను. నాపై చాలా అసభ్యకరమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు.
 
నా ప్రైవేట్ పార్టుకి శస్త్రచికిత్స చేయించుకున్నానంటూ దారుణమైన ప్రచారం చేస్తున్నారు. నాకు ఎలాంటి చికిత్సలు జరగలేదు. కోర్టువారు నాకు ఎలాంటి పరీక్షలు చేయించాలన్నా అందుకు సిద్ధంగా వున్నాను. పరకామణి విషయంలో నేను చేసింది మహాపాపం. ఆ పాపం ఎంతటిదో నా కుటుంబం నేను అనుభవిస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు.