ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By డీవీ
Last Modified: ఆదివారం, 15 మార్చి 2026 (15:37 IST)

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

Statue of Sacrifice
తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ప్రతిష్టించాము. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
 
ముఖ్య అతిథులు:
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు (ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్)
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు (ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్)
శ్రీ నారా లోకేష్ గారు (మంత్రివర్యులు)
శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు (బిజెపి రాష్ట్ర అధ్యక్షులు)
 
కార్యక్రమ వివరాలు:
తేదీ: 16 మార్చి, 2026 (సోమవారం)
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్క్ (శాఖమూరు, అమరావతి).
 
ముఖ్య అంశాలు:
ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల సువిశాల స్థలంలో స్మృతి వనం.
శంకుస్థాపన జరిగిన 6 నెలల్లోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి.
తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే "స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్".
 
తెలుగు వారందరికీ ఇది గర్వకారణమైన సమయం. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు డూండి రాకేశ్, మేనేజింగ్ ట్రస్టీ, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, చైర్మన్, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్.