శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 17 మార్చి 2026 (13:26 IST)

Nara Rohit: చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ?

Chintakayala Vijay with  Nara Lokesh, Chandrababu Naidu
Chintakayala Vijay with Nara Lokesh, Chandrababu Naidu
పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత విధేయత కలిగిన వాళ్లలో ముఖ్యులు శ్రీ అయ్యనపాత్రుడు.. పార్టీ తరపున 7 సార్లు గెలిచి నర్సీపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ కంచు కోటలా మార్చేశారు..  ఇప్పుడు ఆయన కుమారుడైన చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లనున్నారా ..? అంటే అవుననే సమాధానమే వస్తుంది.. గతంలో రెండుసార్లు ఎంపీ సీటును వదులుకుని అధిష్టానం ఆదేశానుసారం పార్టీ విజయంలో తన పాత్ర పోషించడంలో విజయ్ అధిష్టానం దృష్టిలో పడినట్టు సమాచారం.. పైగా గత ప్రభుత్వ హయాంలో ఐటీ వింగ్ పై దాడులు చేసినా కూడా వెనకడుగు వెయ్యకుండా తన వాణి వినిపించడం లో సత్తా చాటారు.
 
పైగా యువగళం పాదయాత్రలో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తూ కూడా పార్టీ కేడర్ సమన్వయ పరచడంతో నారా లోకేష్ నమ్మకస్తుడిగా మారిపోయాడు...ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా , ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న అయ్యనపాత్రుడు గారి వారసుడిగా విజయ్ ను డిల్లీ కి అవకాశం కల్పించడం ద్వారా బీసీలకు పార్టీ పెద్ద పీట వేస్తుంది అని బీసీల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది అని అధిష్టానం భావిస్తుంది. పైగా విజయ్ విద్యార్హతలు, జాతీయ రాజకీయాల్లో ఆసక్తి, ఆధునిక సాంకేతిక పై ఆయనకున్న పట్టు, రాష్ట్ర ప్రయోజనాలపై గొంతు వినిపించగల సత్తా ఆయనకు అదనపు అర్హతలుగా ఉన్నాయి.
 
ప్రస్తుత పరిస్థితులలో కూటమి బలం దృష్ట్యా నాలుగు స్థానాలు సులువుగా దక్కే అవకాశం ఉండడంతో విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.. యువతరానికి అవకాశాలు ఇవ్వడంలో ముందు ఉండే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈసారి యువనేత విజయ్ కి మార్గం సుగమం అయ్యిందనే చెప్పాలి. అధికారకంగా ఇంకా పార్టీ నుండి ఎటువంటి ప్రకటన రానప్పటికీ విజయ్ పేరు ఖచ్చితం అనే న్యూస్ టీడీపీ వర్గాల్లో మారుమోగుతోంది.